మిగతా శరీరం వున్న రంగులో మోచేతులు, మోకాళ్ళు వుండవు. అక్కడ పేరు కొన్న నలుపు పోవాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. అలోవీరా గుజ్జు ఒక మంచి మందు దీన్ని ప్రతి రోజు నల్లగా అయినా మోచేతులు, మోకాలు పాదాల పైన రాస్తూ ఉంటే చాలా కొద్ది రోజుల్లో నలుపు మాయమై పోతుంది. పాలు, తేనె, పసుపు మంచి కాంబినేషన్. పాలు బ్లీచ్ లాగా పని చేస్తే, తేనె చర్మానికి తేమను అందిస్తుంది. పసుపు క్రిమిసంహరకం. ఈ మూడింటిని కలిపి ప్యాక్ లావేసినా ప్రయోజనం వుంటుంది. ఆలివ్ ఆయిల్ పంచదార లో స్కెచ్ చేసిన మంచి ఫలితం. మోచేతులు, మోకాళ్ళ పైన స్క్రాచ్ చేసి జిడ్డు పోయేందుకు వేడి నీటి తో కడిగేసుకుంటే చాలు. నిమ్మరసం కుడా చర్మానికి తెల్లదనం ఇస్తుంది. అలాగే బాదం పప్పు మెత్తగా మారి, నల్లబడిన ప్రాంతంలో రుద్దినా మ్రుతకనాలు పోయి తెల్లగా అయిపోతాయి.

Leave a comment