Categories
భాదం పప్పులు నానబెట్టి తింటేనే అందులోని పోషకాలు పూర్తిగా అందుతాయి అంటారు పోషక నిపుణులు. బాదం పై తొక్కలో ఉండే టాన్సిల్స్ భాదం లోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అందుకే వాటిని రాత్రివేళ నానబెడితే ఉదయానికి ఆ తొక్క వలిచి తినవచ్చు. లేదా ఒకేసారి ఎనిమిది గంటలు నానబెట్టి పై తొక్క తీసేసి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. నానబెట్టిన పప్పులో లైపేజ్ అనే ఎంజైమ్ విడుదల వల్ల కొవ్వులు త్వరగా వ్యర్ధం అవుతాయి, ఇందులోని విటమిన్ ప్రీ రాడికల్స్ నుంచి చర్మకణాలు రక్షించటం ద్వారా వృద్దప్యాన్ని అడ్డుకుంటుంది.