గర్భవతి అయ్యాక వేవిళ్ళ దగ్గర నుంచి పురుటినొప్పుల వరకు నానా కష్టాలుపడేది అమ్మే కనుక అన్ని ఆమెకే ఇబ్బందులు అనుకొంటాం కానీ యు.ఎస్ పరిశోధకులు కొన్నెళ్ళ పాటు ఈ విషయంలో పరిశోధనలు చేసి కొన్ని అనుభుతుల విషయంలో తండ్రి అసలు సిసలు భాగాస్వామిగానే ఉంటాడని తల్లి మాదిరే ఆయన కూడా ఎంతో డిప్రెషన్ కు లోనవుతాడని తేల్చారు. ఈ డిప్రెషన్ స్థాయి ఒక్కోసారి చాలా ఎక్కువగా చివరకు వైద్య సహాయం తీసేకొనే వరకు వెళుతోందట. బిడ్డను కడుపులో మోసే సమయంలో అమ్మ మనసు లో కుటుంబం తన బిడ్డపట్ల చూపించే శ్రధ్ద విషయంలో ఇలాంటి సమయంలో కూడా తను చేయవలసిన ఇంటి పనుల పట్ల ఎంతో ప్రతి కూలంమైన భావాలు ఉంటాయి. తండ్రి డిప్రెషన్ కూడా దాదాపు ఇదే భావాల వల్ల కలుగుతోందట.భార్య ఆరోగ్యం,పుట్టబోయే బిడ్డ గురించిన ఆలోచనలో భర్త డిప్రెషన్ కు గురవుతాడని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment