Categories
సిటీ లైట్స్ సినిమాతో పరిశ్రమ దృష్టిలోకి వచ్చింది పత్రలేఖ. చార్టడ్ ఎకౌంటెన్సీ కోర్స్ చేయటం కోసం ముంబై వచ్చి నెమ్మదిగా కమర్షియల్స్ ,సినిమాలు ఆడిషన్స్ మొదలు పెట్టింది. మూడు నెలల యాక్టింగ్ వర్క్ షాప్ తర్వాతనే సిటీలైట్స్ లో అవకాశం వచ్చింది. ఆరేళ్ళ పాపకు తల్లి పాత్రలో ఆరవై నాలుగేళ్ళ వయసులో నటించింది పత్రలేఖ. అయితే ఈ పాత్ర నాలో ఉన్న నటికి నిర్వచణం చెప్పింది. నేను నెమ్మదిగా పరిశ్రమలో నిలదొక్కుకున్నాను. ఒక్క సారి ఒక్క ప్రాజెక్టు వస్తుంది. మూడు ,నాలుగు నెలలు పని ఉంటుంది. మిగత తీరిక అంతా పుస్తకాలు చదువుతూ ,వెబ్ సీరిస్ చూస్తూ షిల్లాంగ్ లో ఉన్న నా పెంపుడు కుక్కలతో ఆడుతూ గడిపేస్తా అంటోంది పత్రలేఖ.