Categories
బంగారం కొనడం అన్ని విధాలా మంచిదే. పొదుపు చేసిన డబ్బుతో చాలా మంది బంగారం కొనుక్కునేందుకే ఇష్టపడతారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోక పొతే డబ్బు నష్ట పోవడం ఖాయం. 916 క్యారెట్ బంగారం లో 99 శాతం స్వచ్చత వుంటుంది. ఇలా వున్న వాటి పైన హాల్ మార్క్ గుర్తు వుంటుంది. దీన్ని బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిర్ణయిస్తుంది. దీన్నీ గమనించుకోవాలి. కంప్యుటర్ బిల్లు అయినా పర్వాలేదు. చిన్న ముక్కు పుడక కొన్నా సరే బిల్లు తీసుకోవాలి. రాళ్ళ తో కలిపే నాగ ధరను నిర్ణయించారా? లేదా విడిగా ఇచ్చారా అన్నది తెలుసుకోవాలి. లేదా బంగారం, బిస్కెట్స్ నాణేల రూపంలో తీసుకోవాలి అనుకుంటే వాటిని బ్యాంకు ల నుంచే తీసుకోవాలి. దుకాణాల కంటే నాణ్యత విషయంలో బ్యాంకులను నమ్మడమే మంచిది.