Categories
ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీ కి అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఇరాన్ లో మహిళల అణిచివేత మానవ హక్కులపై అవగాహనా,అందరికీ స్వేచ్ఛ మరణశిక్ష రద్దు కోసం చేస్తున్న ఆమె పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గీస్ ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు సర్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్ లోని ఎనిక్ జైల్లో ఉన్నారు.