మన సంప్రదాయం అనుభవంతో ఇచ్చిన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అధ్యయనాలు ద్వారా ప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరికైనా చిన్న పాటి అనారోగ్యం అనిపించినా ఆస్పత్రి లో ఉన్నా పరామర్శించి రావటం మన సమాజ సంప్రదాయం. అదే విదేశాల్లో అయితే కుదరదు. రోగిని కలిసేందుకు అనుమతి ఇవ్వరు. చూడటానికి వచ్చేవారు అంటు రోగాలు తెస్తారని వారి భయం. కానీబంధు మిత్రులు వచ్చి పలకరించడం వల్ల రోగికి మనో ధైర్యం వస్తుందనేది మన నమ్మకం. ఇప్పుడైతే మన పద్దతే సరైనది. అంటున్నాయి ఎన్నో అధ్యయనాలు . ఆస్పత్రుల్లో విజిటర్స్ తాకిడి పెద్ద సమస్యే అయినప్పటికీ బంధుమిత్రులు వచ్చి చెప్పే కబుర్లు కొన్నింటికి నవ్వుకోవటం తమ వంతు చూపించే ప్రేమ శ్రద్ధ ఇవన్నీ మనోధైర్యం పెంచి మందుల కంటే ఇవే బాగా పనిచేసి రోగికి త్వరగా కోలుకొంటాడని చెపుతున్నాయి అధ్యయనాలు .
Categories