Categories
ఈ కరోనా సమయంలో కండరాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కు కొవ్వులు చాలా అవసరం. ఆహారం నుంచి లభించే రసాయనిక భేదాలను బట్టి మంచి చెడు కొవ్వులు గా పిలుస్తారు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తో ఫాస్ట్ ఫుడ్స్ లో డాల్డా, వనస్పతి వంటి వాటిని వాడి తయారుచేసే బేకరీ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల రక్తంలో L.D.L కొలెస్టరాల్ పెరుగుతుంది.మంచి కొవ్వులు అంటే పోలీ అన్ శాచురేటెడ్, మెనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్. ఇవి గింజలు, పప్పులు నుంచి వచ్చే నూనెలో ఉంటాయి.ఇక శాచురేటెడ్ ఫ్యాట్స్ పాలు, వెన్న, నెయ్యి, చికెన్, మటన్ తదితర ఆహారాల నుంచి లభిస్తాయి ఇది కొంత స్థాయిలో తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.