ఏడాది పొడువునా దొరికే సొరకాయ సౌందర్య ప్రదాయిని ఇందులో ఉండే సి విటమిన్ తో చర్మం నిగారిస్తుంది .జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి. విటమిన్ సి కొలాజెన్ ఏర్పాడటాన్ని మెరుగు పరుస్తుంది. దీని వల్ల ముడతలు తగ్గి చర్మం పొడి బారకుండా ఉంటుంది. 92 నుంచి 96శాతం నీరు ఉండటం శరీరం చల్లబడుతోంది. అలసటకు మంచి మందు. పరిపూర్ణమైన పోషక కూరగాయ ఇది. క్యాలరీలు తక్కువ ,కొవ్వు లేదు. ఖనిజాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. సోరకాయ ముక్కలు బ్లెండ్ చేసి నిమ్మరసం పిండి చేసే జ్యూస్ చాలా మంచిది. త్వరగా ఆక్సిడైజ్ అవుతుంది కాబట్టి తీసిన వెంటనే తాగేయాలి.

Leave a comment