జాతీయ అవార్డ్ గ్రహీత ఫ్యాషనిస్ట్ సోనమ్కపూర్ ఫ్యాషన్, పర్సనల్ స్టయిల్ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. పబ్లిక్ ఫంక్షన్ అయినా, రెడ్ కార్పెట్ అయినా, మేగజైన్ అయినా ఆమె ప్రత్యేకమైన ఫ్యాషన్ పోకడతో వుంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ అనేది చిత్ర పరిశ్రమలో వచ్చిన ఒక కొత్త ఆలోచన. ప్రతి యాక్టరూ తమ ప్రత్యేకత చూపించేందుకు ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్ లేని సినిమాలు, సినిమాల్లేని ఫ్యాషన్ వర్కవుట్ కావని నా ఉద్దేశ్యం అంటుంది సోనమ్. దృశ్య మాధ్యమం, డైలాగ్స్, నటన కాకుండా గ్లామర్ తో ప్రేక్షకులను ఆకర్షించాలని సోనమ్ నిశ్చితమైన అభిప్రాయం. మనం ధరించే వస్త్రాలు మన మైండ్ కు మ్యాచ్ అవ్వాలి. మన మనస్సుని ప్రతిబింబించాలి. చిన్నప్పుడు బ్లాక్ జీన్స్ వేసుకునేదాన్ని, బ్లాక్ లిప్ స్టిక్ వేసుకుని, నాలుక చెవులు కుట్టించుకుని, వైల్డ్ చోకర్స్, స్ట్రైట్ హెయిర్ కట్ తో పదేళ్ళ క్రితం కుడా నేను ఫ్యాషన్ ప్రతిరూపమే. ఇప్పుడయినా నేనే సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ అంటోంది సోనమ్ కపూర్.

Leave a comment