Categories
టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉంది. అది తెలిసిన విషయమే. కానీ నేను చక్కని నటిని అని నిరూపించుకొన్నాక కూడా ఆ భూతం నన్ను వెంటాడిందంటే కాస్త బాధగా ఉంది అంటోంది పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100లో బోల్డ్ కారేక్టర్ చేయటం వల్ల నాకు ఇలాంటి వేధింపులు వస్తున్నాయని అనిపించింది. ఇటీవల ఒకరు ఇలాంటి ఆఫర్ తో నన్ను కలిశాడు. మంచి ఆఫర్ ఇస్తా మరీ నాకేమిటి? అన్నాడు. నేనెంత షాక్ తిన్నానో. కంట్రోల్ చేసుకొనేందుకు చాలా కష్టపడ్డాను. నటిగా నాకు వచ్చిన పాత్రలు చేసినంత మాత్రానా నన్ను అంత తేలిగ్గా మాట్లాడితే చాలా కష్టం అనిపించింది. నటిగా నేను నిలబడ్డానంటే నా నటన వల్లగానీ ముద్దుసీన్ల వల్ల కాదు.నాకు ఇంటరెస్ట్ లేదు అని ఆ ఆఫర్ ను తిరస్కరించానంటోంది పాయల్ రాజ్ పుత్.