బాలీవుడ్ సారిక దక్షిణాది కలల హీరో కమల్ హాసన్ ల పుత్రిక శృతి హాసన్ వారసత్వ రీత్యా సృజనాత్మకతను అందిపుచ్చుకుంది. ఇప్పుడు దక్షిణాదిలో బిజీ. నాన్న తో కలిసి త్రి భాషా చిత్రంలో నటిస్తోంది. అంతర్జాతీయ ఆర్టిస్టులతో కొలాబరేషన్లు రాక్ అండ్ రోల్ అంటూ ఉర్రుతలూగించే ప్రాజెక్టులున్నాయి. వృత్తి సినీ నటి అయినా గొప్ప గాయని. నేనో రాక్ స్టార్ ని అని నవ్వుతోంది శృతి. ఫెమినిజం లో పాప్ కల్చర్ కలిసి ఆ పదం డైల్యూట్ అయింది. ఫెమినిస్ట్ మహిళలు ఆ సిద్ధాంతాలతో జీవిస్తుంటే వాళ్ళకే విషయం తెలుస్తుంది మీరు ఫెమినిస్టా అన్న ప్రశ్నకు జవాబిస్తూ గత ఏడాది నేను 365 రోజుల్లో 340 రోజులు పని చేశాను. ఐదేళ్లుగా ఇంతే కష్టపడుతున్నా. సంగీతం నా పర్సనాలిటీ ని ప్రోజెక్ట్ చేసింది. సినిమా దాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ రెండిటినీ నేను నియంత్రించుకోలేను. అన్నది శృతి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ. ఈ సెలబ్రెటీల గారాల పట్టి తన ఏడోవ ఏట రెండు లక్షల మంది ప్రేక్షకుల ముందు తొలిసారిగా పాట పాడిందట. అప్పుడా అమ్మాయిలో భయం లేదు జంకు లేదు అచ్చంగా ఇప్పుడున్న శృతి కూడా ఇలాగే మారకుండా వుంది.
Categories