Categories
మార్చి లో జరిగిన ఫ్యాషన్ షో కు హాజరై తన ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మిస్ వీల్ చైర్ ఉక్రెయిన్ ఒక్సానా కోనోనెట్స్. రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తున్న సమయంలో ఫ్యాషన్ షో లో ఎలాగైనా పాల్గొనాలనే కోర్కెతో ట్రైన్ లో పది గంటలు ప్రయాణం చేసి పోలాండ్ చేరుకుని అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ చేరుకుంది ఒక్సానా. పారిస్ ఫ్యాషన్ షో లలో పాల్గొని ఉమెన్ ఆఫ్ ది థర్డ్ మిలీనియమ్ అవార్డు గెలుచుకున్న ఒక్సానా,మా ఉక్రెనియిన్ మహిళలు చాలా బలవంతులు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంత ధైర్యంగా ఉండగలమో ప్రపంచానికే చూపించాలనుకొన్నాను అంటుంది.