కధ వినేప్పుడు ఆకథలో నేనున్నానో లేదో అర్ధం చేసుకొంటూ ఉంటా. నేనా కథలో నటిస్తే ఆ పాత్రతో నాకు మానసిక బంధం ఉంటుంది . ఆ పాత్రలో నన్ను నేను చూసుకొంటా . వ్యక్తిగత అనుబంధం పెంచుకొంటాను . ఇక ఆ సినిమా పూర్తయ్యేవరకు ఆ పాత్ర నా తోనే ప్రయాణం చేస్తు ఉంటుంది అంతగా ఆ పాత్ర తో నేను దగ్గరగా ఉండలేకపోతే బహుశా నటించ లేనేమో కూడా అంటోంది సాయి పల్లవి . సినీ జయాపజయాలతో సంబందం లేకుండా ప్రేక్షకులు సాయి పల్లవిని ఇష్టపడతారు . ఎందుకిలా అంటే సాయి పల్లవి చెప్పే సమాధానం ఒక్కటే ఆ పాత్ర నా ఆత్మ లోకి తీసుకోవటం ,నేనె నేమో అనుకోవటం వల్లనే అంత బాగా వస్తుంది . బహుశా ప్రేక్షకులకు నచ్చేది ఇదేనెమో అంటుంది .