ఈ రోజునుంచి బతుకమ్మ పండుగ సంబరాలు పారంభం. శ్రీ చక్ర ఆకృతిలో బతుకమ్మని పువ్వులతో పేర్చి ప్రదక్షిత పూర్వకమైన ఆటపాటలతో ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుమ్చి మాహర్నవమి వరకు ఆరధించుకునే తల్లి బతుకమ్మ. తొమ్మిది సంఖ్య పుణ్యత్వానికి సూచిక. నవ విధులకు,నవ వర్ణాలకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పూలతో అలంకరిస్తారు. తంగేడు,గునుగు,రుద్రాక్ష,సీతమ్మ జడ,గోరింట,గుమ్మడి,బంతి,మందార,గన్నేరు ,నిత్యమల్లి పువ్వులను పద్దతిగా అలంకరిస్తారు.ఈ తొమ్మిది రోజులు గౌరీ మాత పుట్టింటికి పువ్వులతో తరలి వచ్చినట్లుగా తమ ఇమ్టి ఆడపడుచు బతుకమ్మగా ఆరాధిస్తారు.ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రుపాల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ,అటుకుల బతుకమ్మ,ముద్ద పప్పుల బతుకమ్మ,నానే బియ్యం బతుకమ్మ,వెన్నముద్దల బతుకమ్మ,అట్ల బతుకమ్మ,సగినాల బతుకమ్మ,అలిగిన బతుకమ్మ,సద్దుల బతుకమ్మ గా భక్తులను ఆశీర్వదిస్తుంది.
Categories