Categories
దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సృష్టిలో ఉండే సర్వ ప్రాణుల్లో ఉండే మూలరూపం పరాశక్తి సమస్థ చైతన్య ఆమెలో అంతర్భాగం ఆ శక్తి స్వరూపిణి ఆశ్విజ శుద్ద పాడ్యమి రోజు అవతరించి నవమి నాడు రాక్షస సంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రూపలతో అమ్మవారిని ఆరాధిస్తారు మహలక్ష్మి ,సరస్వతి కాత్యాయని,మహగౌరి ఏ పేరుతో పిలిచినా అమ్మ కరుణా స్వరూపిణి. జగదాంబ తొమ్మిది రోజుల పాటు శత్రు సమ్హారం చేసి పదో రోజు విఅజయోత్సవం జరుపుకుంటుంది కాబట్టి ఆ రోజు వచ్చే దశమే విజయ దశమి. ఈ 9 రోజులు తొమ్మిది అలంకారాలతో తొమ్మిది నైవేద్యాలతో అర్చన చేస్తున్నారు.