కరోనా కట్టడి చేసేందుకు సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. చేతులతో ఇష్టానుసారం వస్తువులు తాకవద్దని తలుపులు హాండెల్స్,ఎంతో మంది ముట్టు కొంటూ ఉంటారు కనుక వాటిని తాకితే చేతులు కడుకోవాల్సిందే అని డాక్టర్లు గట్టిగ హెచ్చరికలు చేశాక,ఆ తలుపులు, తాకకుండా తెరిచేందుకు డోర్ హుక్ లు మార్కెట్ లోకి వచ్చాయి. లండన్ కు చెందిన డిజైనర్ స్టీవ్ బ్రుక్స్. నాలుగు రకాల డోర్ లాక్ లు తాయారు చేశారు. వాటిని తలుపులకు అమర్చితే చేతులతో కాకుండా ముంజేతులతో తీయచ్చు. ఎంతో సులభంగా శుభ్రం చేసుకొనేందుకు వీలుగా ఉన్న ఈ హుక్స్ ప్రస్తుతం ఆస్పత్రుల్లో తలుపులకు అమరుస్తున్నారు వైద్య సిబ్బంది ప్రతిసారీ చేతులు కడుక్కోవలసిన అవసరం తప్పి పోయింది.

Leave a comment