ఈ మధ్య కాలంలో అమెరికాకు నెయ్యి ఎగుమతులు ఎక్కువై పోయిందిట. మనం నెయ్యి అన్నం ,ఉప్పు ,గుడ్లు , చివరకు నీళ్ళు కూడా తగ్గించేసాము. పళ్ళ బిగువున నోరు కట్టేసుకుంటున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. అంటున్నారు నిపుణులు. నెయ్యి తగిన పాళ్ళలో వాడుకుంటే నష్టం లేదు. క్రీడా కారులు చురుగ్గా ఉండేందుకు శక్తి సోమ నెయ్యి ఉపయోగిస్తున్నారు. ఇందులోని మీడియం చెయిన్ ఫ్యాటీ ఆమ్లాలకు ఇతర కొవ్వులను కరిగించే శక్తి వుంది. అలాగే మనం కూరల్లో వేసుకునే ఉప్పు కన్నా ఇన్స్టెంట్ సూప్ లు, సొయా సాస్ , ఊరగాయల్లో వుండే ఉప్పే ఎక్కువ. అలాగే అన్నం మాంసాహారం కలిపి తినటం వల్ల కండర పుష్టికి కావలిసిన సంపూర్ణ పోషకాలు అందుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు తప్పించి అన్నం నెయ్యి ఉప్పు మితంగా తినచ్చు. ముఖ్యంగా నెయ్యిలో బ్యుటైరిక్ యాసిడ్ వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. యాంటీ వైరల్ గుణాలు అధికం కూడా. నెయ్యిని మరీ తీసిపారేయకండి.
Categories