Categories

ఆడవాళ్ళు చాలా గంటలు నించోనే పనిచేస్తారు. వంటఇంట్లో పనులు నిలబడి చేయవలిసి వుంటుంది గ్యాస్ పొయ్యి సిలెండర్ తక్కువ ఎత్తులో వుంచుకోడానికి రక్షణ చర్యలో పొయ్యి ఎత్తుగా అరుగుపైన ఉండటం పక్కనే నిలబడి చాకు తో కూరలు కోయటం, చపాతీలు చేయటం అంత గంటలతరబడి నిలబడే వుండవలసివస్తుంది అదే పనిగా కూర్చోవటం మంచిది కానట్లే నిలబడటం కూడా మంచిది కాదంటారు. ఉద్యోగినులు బస్సుల్లో రైళ్ళలో నిలబడి ప్రయాణాలు చేస్తారు. ఇలా ఎక్కువ సేపు నిలబడి పని చేయటం వల్ల వెరికోజ్ వెయిన్స్,కాళ్ళ వాపులు నడుము నొప్పి డిహైట్రేషన్ మొదలవుతుంది శరీర భారం మొత్తం కాళ్ళ ఫై పడుతోంది కనుక జాగ్రత్త అంటున్నారు అద్యాయన కారులు.