Categories
గడచిన ఆరునెలల్లో మొత్తం 22 గంటలు మాత్రమే నేను ఇంట్లో గడిపాను . తీరిక లేకుండా పనిచేస్తున్నాను . ఇంటిపై బెంగ పెట్టుకొన్నాను . ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలని ఉంది . ఇంట్లోంచి షూటింగ్ కు బయలుదేరుతూ ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేస్తారు ఇంట్లోవాళ్ళు అంటుంది రష్మిక మండన్న. తెలుగు ,కన్నడ ,తమిళ భాషాల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోందామె . ఒక్కో షూటింగ్ ఒక్కోచోట జరుగుతుంది అందుకే నాన్ స్టాప్ గా ప్రయాణం చేస్తూనే ఉన్నా . సినిమా లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కు ప్రయాణం చేస్తుంటే నా ప్రయాణాలు నాకే వింత గొల్పుతూ ఉన్నాయి . ఒక్కటి మాత్రం చెప్పగలను నాలాటి అమ్మాయిలు ఏ వృత్తిలో ఉన్న సరే చేతినిండా పని ఉండి బిజీగా ఉంటేనే సంతోషంగా ఉంటాము అంటోంది రష్మిక .