Categories
శరీరం ఒక్కసారి మాట వనదు,అలసటగా నీరసంగా ఒక్క పనిగా ఉత్సహాం లేకుండా అయిపోతుంది. వీటన్నింటికీ ఒకే కారణం అయివుండాలని రూలేం లేదు. సరైన ఆహారం తీసుకోక ,పోషకాల లేమి కావచ్చు. రక్తం తక్కువ కావచ్చు.తగినన్ని ఎర్ర రక్త కణాలు,హిమోగ్లోబిన్ శరీరంలో లేకుంటే అలసట రావచ్చు. ఊపిరి తీసుకోవటంతో ఇబ్బంది కనిపించవచ్చు. రోజంతా అవసరం అయ్యే శక్తికి తగినంత ఆహారం చాలా అవసరం .శరీరంలో కావలసినన్ని ధ్రవపదార్థాలు లేకపోయినా సమస్యే .థైరాయిడ్ గ్రంథి పని తీరులో లోపం కావచ్చు ,మాత్ర నాళపు ఇన్ ఫెక్షన్ లు కారణం కావచ్చు. ముఖ్యంగా పోషకాలు అందకనే కావచ్చు. ఇలాంటి సందర్భంలో డాక్టర్ ను కలిసి ఈకారణాలు ఎంత వరకు సమంజసమో తేల్చుకిని చికిత్స చేయించుకోవటం చాలా మంచిది.