యుక్త వయసుకు వస్తున్న పిల్లల్ని తల్లిదండ్రులు మరీ అదుపాజ్ఞల్లో ఉంచటం ,తమ ఇష్టాలను వారిపై బలవంతంగా రుద్దటం వల్ల ఆ ప్రభావం వారి జీవితాంతం ఇబ్బంది పెడుతుంది అంటున్నారు అధ్యయనకారులు. టీనెజ్ లో అస్తమానం పెద్దవాళ్ళ ప్రభావానికి గురైనా పిల్లలు పెద్దయ్యాక ఒక చిన్న నిర్ణయం తీపుకోవాలన్న భయపడుతారని చెపుతున్నారు. కొన్ని వందల మంది పిల్లల్ని ,వారికి ఇష్టం లేని ఏ పనులను బలవంతంగా చేస్తున్నప్పుడు వాళ్ళ మెదడు పని తీరు రికార్డ్ చేశారట. ఆ తర్వాత పదేళ్ళకి ,వాళ్ళ భావోద్వేగాలు పరిశీలిస్తే చిన్న వయసులో ఒత్తిడికి గురై పెద్దవాళ్ళ పెత్తానానికి తలవంచిన పిల్లలు సాహాసంతో కూడిన పని ఏదైనా సరే చేసేందుకు భయపడుతున్నాట్లు రుజువైంది. చిన్న వయసులో పిల్లల మనసుపై పడ్డ ప్రభావం పీడకలలాగా జీవితాంతం వెన్నంటి ఉందన్న మాట.
Categories