పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు ‘నో’ అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా వుండి. ఇప్పుడు కాదు పో, విసిగించకు పో, ఆడుకో పో అంటూ వుంటారు. అలాగే, పరుపులెక్కి తొక్కొద్దు, కుర్చీ లో నుంచి దూకొద్దు, కిటికీ లో నుంచి చూడొద్దు, అలా ఎగరోద్దు, పరుగెత్తోద్దు, ఇక ఇలా అన్ని ఆంక్షలే. ఇక స్మార్ట్ ఫోనో, టీ.వి నో అలవాటు చేస్తారు. తీరాదానికి అలవాటు పడి అదే పనిగా చూస్తుంటే అదీ తప్పంటారు. మరి పిల్లల సంగతి ఏమిటి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వాళ్ళతో కబుర్లు చెప్పండి, ఆడండీ, వాళ్ళకు ఎం కావాలో తెలుసుకోండి, సందేహాలు తీర్చండి. బయటకు తీసుకు పోయి ఆడించండి. డబ్బు కాదు వాళ్ళకోసం ఇవ్వాల్సింది సమయం అంటున్నారు. తల్లి దండ్రులు ఆలోచించాలి మరి.
Categories