ఇప్పుడు నో మేకప్ లుక్ ఫ్యాషన్. సహజమైన లుక్ లో కనిపించాలంటే మేకప్ సామాగ్రిని అవతల పెట్టి,చర్మం రంగుకు దగ్గర గా ఉండేవే ఎంచుకోవాలి. బేబీ క్రీమ్ హైడ్రేటింగ్ ఫేస్ ఆయిల్ తో సహజమైన మెరుపు తేవచ్చు లేత గులాబీ రంగు బ్లష్ వేసేయాలి. క్రీమ్  ఆధారితమైతే ఇంకా మంచిది. కళ్ళపై లేదా కాపర్ రంగు ఐ షాడో నీ పల్చగా అద్ధి మస్కారా రాస్తే సరి. అలాగే పెదవులకు సహజ లుక్ కోసం లిప్ స్టెయిన్, లిప్ టింట్ లు ఉత్తమ ఎంపిక లేత రంగులు ఎంచుకుంటే మేకప్ లేనట్లుగానే ఉంటూ అందంగా కనబడవచ్చు.

Leave a comment