![](https://vanithavani.com/wp-content/uploads/2021/05/rubel.jpg)
రూబుల్ నేగీ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా అనగారిన వర్గాల పిల్లల జీవితాల్లో కళ ద్వారా వెలుగులు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు. రూబుల్ నేగీ ప్రముఖ కళాకారిణి సామాజిక కార్యకర్త శిల్పా చిత్రకళలో నిష్ణాతులు మీసాల్ ముంబై క్యాంపెయిన్ ల ద్వారా ఇప్పటివరకు మురికివాడల్లో 20 వేల పైగా ఇళ్లకు పెయింటింగ్ తో హంగులు అద్దారు. ఇప్పుడు కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ రోజుల్లో తన డే కేర్ సెంటర్ లను పిల్లలకు కోవిడ్ కవచాలుగా మార్చారు. అక్కడ ఉచిత వసతి భోజనం విద్య అన్ని సమకూర్చారు. ఆమెకు ముంబై తోపాటు ఢిల్లీ, రాజస్థాన్, నోయిడా తదితర తొమ్మిది ప్రాంతాల్లో డే కేర్ సెంటర్లు ఉన్నాయి అవన్నీ కరోనా కేంద్రాలుగా మార్చారు ఒక రూపాయి కూడా తీసుకోకుండా పిల్లలను కంటికి రెప్పలా కాపాడతారు రూబుల్ నేగీ .
![]() |