ఈ సీజన్ లో చిక్కుడు కాయలు ఎక్కువగా వస్తాయి. వందగ్రాముల చిక్కుడు కాయల్లో దాదాపు మూడు వంతుల పైన నీరు వీటి నుంచి 24 కేలరీల శక్తి లభిస్తుంది. నాలుగు గ్రాముల మాంసకృత్తులు రెండు గ్రాముల పిండి పదార్థాలు, పీచు తొమ్మిది గ్రాములు ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండదు. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. బాలింతలు, గర్భిణీలు, వ్యాయామం చేసే వారికి చక్కని ఎంపిక. వీటిలో క్యాల్షియం, విటమిన్-డి ఉండటం వల్ల ఎముకలకు మంచిది. ఎండిన చిక్కుడు గింజలను కూరల్లో ఏడాది పొడవునా వాడుకోవచ్చు.

Leave a comment