Categories
రోగనిరోధకశక్తి కోసం ఉల్లిపాయి, క్యారెట్ సూప్ ప్రయత్నించండి అంటున్నారు పోషకాహార నిపుణులు.స్టౌ పైన గిన్నె పెట్టి ఇందులో రెండు స్పూన్ల వెన్న లో అల్లం తురుము,ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు,టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఉడికించి ఇందులో కాయగూరలు, ఆకు కూరలు ఉడికించిన నీళ్ళు పోసి తక్కువ మంట పైన పది నిమిషాలు మరగ నివ్వాలి .చివరగా కొత్తిమీర తురుము పుదీనా ఆకులు వేసి నిమ్మరసం కలిపితే రుచిగా ఉండే సూప్ తయారవుతోంది.క్యారెట్ లోని బీటా కెరోటిన్,పీచు,విటమిన్ కె,ఇవన్నీ గొంతునొప్పి ఇన్ఫెక్షన్లను రానివ్వదు.