Categories
![ఆరోగ్యం ఇవ్వటంలో సోయాగింజల పాత్ర ఎక్కువే ఉందంటున్నాయి అధ్యయనాలు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సొయా దాని ఉత్పత్తులు మన దేశపు మార్కెట్ నీ ఆకట్టుకున్నాయి. సొయా నట్స్ సొయా బీన్స్ సొయా మిల్క్ సొయా యోగర్ట్ సొయా ఇసోలెన్స్ సొయా లెసిటిన్స్ మన మార్కెట్ నింపేస్తున్నాయి. శాఖాహారులకు అవసరం అయ్యే ప్రోటీన్లు అందేది సొయా ద్వారానే సొయా అనేది మాంసానికి ప్రత్యామ్నాయం అన్నది ప్రచార అంశం . సొయా ఎడమేమ్ అనేది ఉడికించి ఉప్పుతో కలిపి చిరుతిండిగా తినచ్చు. సోయాను సూప్ లు సలాడ్స్ లో కలుపుకుని తినచ్చు. సొయా సూప్ మంచిదే. ఆవుపాలు బదులు సొయా పాలు వాడటం మొదలు పెట్టచ్చు. సోయా ఉత్పత్తులు ఉదయపు అల్పాహారం మధ్యాహ్నం చిరుతిండిగా బేకింగ్ చేసిన వంటకాల్లో శాండ్ విచెస్ కాస్ రోల్స్ స్టెరిఫీడ్ ద్వారా సోయాకి ఎదో రకంగా తీసుకుంటే ఈ పోషక విలువల్ని సోయా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.](https://vanithavani.com/wp-content/uploads/2016/12/soya.jpg)
ఎముకలు బలంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. సోయా బీన్స్ లో అధికంగా ఉండే ప్రొటీన్లు కాల్షియం ఎముకల బలోపేతం చేస్తాయి మోనోపాజ్ దశలో మహిళల్లో ఎముకలు బలహీనం పడకుండా సోయా ఉత్పత్తులు కాపాడతాయి అలాగే గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి.వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు బలోపేతం అవటమే కాకుండా ఆస్టియో పోరోసిస్ బారిన పడే ప్రమాదం తప్పుతోంది ఈ గింజల్లో ఉండే మంచి కొవ్వులు అరికాలి మంటలను తగ్గించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోజుకో పది గింజలు తినవచ్చు అలాగే పాలకూర, బ్రోకలీ లోకి పోషకాలు ఎముకల దృఢత్వానికి కాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.