ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు పొడిబారడం జరుగుతుంది.ఇది ఈ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తేటగా అయిపోతాయి. పల్చని దూది పొరను గులాబీ నీళ్లలో ముంచి కళ్ల పై ఉంచుకుంటే చాలు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలకు కలబంద గుజ్జు కూడా మంచి పరిష్కారం.ఈ గుజ్జును టిష్యూ పేపర్ పైన వేసి కనురెప్ప పైన ఉంచుకోవాలి నెమ్మదిగా వేళ్ళతో మర్దన చేయొచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే ఫలితం వెంటనే తెలిసిపోతుంది.అలాగే అలసిన కళ్ల పైన చల్లని నీళ్ళతో తడిపిన పలచని వస్త్రాన్ని ఉంచుకుంటే కూడా కళ్ళు సేద దీరతాయి .

Leave a comment