Categories
చిన్న పిల్లలకు అస్తమానం న్యాపీ వాడతారు . ఈ న్యాపీల్లో అమ్మోనియా ఉండటం వల్ల చర్మం కందిపోయి దద్దుర్లోస్తాయి. కొందరు పిల్లలకు బొబ్బులు,కురుపులు కూడా వస్తాయి. ఈ న్యాపీల్లో చిన్న పిల్లల మలం ఎక్కువసేపు ఉంచటం వల్ల మలంలో ఉండే ఎసిడిటీ ప్రభావం వల్ల కూడా చర్మంపై ర్యాష్ రావచ్చు. అందుకే పిల్లలకు తరుచు న్యాపీలు మార్చేస్తు ఉండాలి. గంటకోసారి మూత్ర విసర్జన గురించి గమనించాలి. ఇక ఈ వేసవిలో ఈ న్యాపీలతో అలర్జీలు కూడా రావచ్చు. కొంత సేపైనా కాటన్ లోదుస్తులు వేసి కొబ్బరి నూనె ,షీ ఒటర్ వంటివి ర్యాష్ వచ్చిన చోట రాస్తే పిల్లలకి చిరాకు లేకుండా ఉంటుంది. పిల్లలు చిరాగ్గా ఏడుస్తు ఉంటే వెంటనే ఈ న్యాపీల వల్ల సమస్యలేమో చూసుకోవాలి.