పండగ లోచ్చాయి అంటే ఆఫేర్లు వెల్లువెత్తాయి. ఆషాడం ఆఫర్, శ్రవణం ఆఫర్, దసరా, క్రిస్మస్ రంజాన్ ఇలా పండగలన్నీ ఆఫెర్ల సముద్రంలో వినియోగదారుని ముంచి లేపుతున్నాయి. అసలీ ఆఫర్ కు కంపెనీలు నష్ట పోయి ఇవ్వవు ఇదొక గాలం సాధారణంగా పెద్ద కంపెనీల దుస్తుల్ని విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి చోట్లోనే తయ్యారవ్వుతాయి. ఆర్డర్ ఇచ్చిన సరకు కంటే ఎక్కువ తయ్యారు చేసి కంపెనీ ఆర్డర్ ప్రకారం తయ్యారు అవ్వుతాయి కనుక బ్రాండెడ్ కీ వీటికి తేడా వుండదు. కొంత మార్జిన్ చూసుకుని ఆఫర్ పేరుతో వినియోగ దారుడి నెత్తిన రుద్దుతారు. పచారీ షాపులో ఒక్క సబ్బుతో పోయే దానికి ఏ మాల్ కు వెళ్ళి అవసరం లేని వస్తువులు కొనుక్కొచ్చి ఆఫర్ తో వచ్చాయని సంతోష పడటం మనకి మిగులు ఒకటి కొంటె నాలుగు ఉచితం అంటారు కదా అక్కడ పడిపోతారు. జాగ్రత్త సుమండీ ఆఫర్ అంటే బురిడీ అని అర్ధం చేసుకోవాలి.
Categories