ప్రతిరోజు ఎనిమిది నుంచి 10 గంటలు ఆఫీస్ లో గడుపుతున్నారు . కనుక దాన్ని కేవలం పని ప్రదేశంలా చూడకండి . అక్కడ కంఫర్ట్ గా ,తాజాగా ,పూర్తి ఉత్సాహంలో కనపడేలా ప్లాన్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వర్కింగ్ ఉమెన్ కు ఇల్లు ఆఫీస్ పని రెండు రకాల బాధ్యతలు ఉంటాయి . రాత్రివేళ ఉదయం ఆఫీస్ కు ఎలా తయారయి వెళ్ళాలో నిర్ణయించు కొనేందుకు కొద్ది సమయం కేటాయించాలి . ఉదయం వేసుకోవలసిన డ్రస్ సిద్ధంగా ఉంచుకోవాలి ఫ్రెష్ లుక్ తో ఉండేందుకు గాను స్నానం తరువాత మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి . రోజు విడిచి రోజు షాంపూ చేసుకోవాలి . కండిషనర్ పెట్టుకోవాలి జెల్ తో జుట్టు సెట్ చేసుకోవాలి . డ్రస్ మేకప్ ,ఫుట్ వేర్ ల పైన దృష్టి పెట్టాలి . లైట్ మేకప్ ,లైట్ జ్యువెలరీ దానికి సరిపోయే మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ఫుట్ వేర్ పర్సనాలిటీని మెరిపిస్తాయి . ఒక వేళ ఆఫీస్ లో డ్రస్ కోడ్ ఉంటే నాలుగైదు జతలు తీసి పెట్టుకొంటే ప్రతిరోజు ముడతలు లేకుండా ఇస్త్రీ చేసినవే ధరించేందుకు వీలవుతుంది . శరీరం కంఫర్ట్ తో ఉంటే కాన్ఫిడెంట్ గా అనిపిస్తారు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .
Categories