వేసవి ఎండకు, సూర్య కిరణాలకు డైరక్ట్ గా ఎక్స్ పోజ్ అయ్యే జుట్టు పొడి బారి బిరుసుగా తెగిపోతూ ఉంటుంది. ఆ ప్రభావం లేకుండా జుట్టు సిల్క్ లాగా మెరవాలంటే చిన్ని జాగ్రత్తలు చాలు. బాదం,కొబ్బరి, ఆలీవ్ ఆమ్లా వంటి నూనెల్లో ఏదో ఒకదాన్ని వేడి చేసి వారానికి రెండు సార్లు తప్పనిసరిగా మసాజ్ చేయాలి. రాత్రి వేళ ఈ నూనె మసాజ్ పూర్తి చేసి రాత్రంతా అలావదిలేసి పోద్దున్నే షాంపూతో కడిగేయాలి. ఆలీవ్ ఆయిల్ కొన్ని చుక్కలు తేనె కలిపి మాసాజ్ చేస్తే జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అరటి పండు గుజ్జు, ఆలీవ్ అయిల్ కలిపి ఆ మిశ్రమంతో మసాజ్ చేసి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే జుట్టుకు ఆరోగ్యవంతమైన పోషకాలు అందుతాయి. అరటి, ఆలీవ్ లు జుట్టుకు చిక్కదనం ఇస్తాయి.