ఎవరికి వాళ్లకు తాము ప్రత్యేకంగా కనిపించాలని ఒక కోరిక ఉంటుంది అలాంటప్పుడు కనిపించిన ప్రతి ఫ్యాషన్ ను అనుసరించటం వల్ల లాభం ఏమి ఉండదు. అలా ప్రత్యేకంగా కనిపించాలి అంటే మీ కోసం ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కేశాలంకరణ లోనూ బొట్టు లోనూ వస్త్రధారణలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి దాన్ని మార్చకుండా ఒక స్టైల్ స్టేట్ మెంట్ గా చేసుకోవాలి.ఉదాహరణకు విద్యాబాలన్ ఎప్పుడూ అంచున చీరలతో,వాణిశ్రీ పెద్ద కొప్పు తో ఒక రాజకీయ నాయకురాలు చేతినిండా గాజులతో ఒక ప్రత్యేకమైన రూపంతో కనిపిస్తారు. అలా అని ఒక మూస ధోరణి ఉండకూడదు నిరంతరం మారిపోయే ఫ్యాషన్ ప్రపంచాన్ని విస్మరించకూడదు.

Leave a comment