మనిషి మనిషికీ ఆలోచనలో తేడా ఉన్నట్లే అందం విషయంలో ప్రాంతం, ప్రాంతానికి కొలమానాలు మారిపోతాయి. ఉదాహరణకు మారిషస్ స్త్రీలు కనుబొమ్మలు కలిసేలా వెంట్రుకలు పెరిగేలా భ్రమ కలిగించే ప్రయత్నం చేస్తారు. అలాగే మారిషస్ అమ్మాయిలు ఎంత లావైతే అంత బావుంటామనుకొంటారు. వెడల్పాటి నుదురు వుంటే సెక్సీగా ఉంటామని ఆఫ్రికాలోని వులా తెగలోని అమ్మాయిలు భావిస్తారు. ఇక చైనా ఆడవాళ్లకు అందమైన రంగంటే ఇష్టం.. సన్ స్క్రీన్స్, ఫేస్ మాస్కులకు చైనాలో మార్కెట్ ఎక్కువ. తెల్లగా ఉంటేనే అందంగా ఉంటామనే నమ్మకానికి మనదేశమూ మినహాయింపు కాదు. మన దేశంలో కూడా వైటెనింగ్ క్రీమ్స్, పౌడర్లు, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇరాన్ అమ్మాయిలు కొనదేరిన ముక్కుల కోసం రైనోప్లాస్టీ చేయించుకొంటారు. అలా ముక్కు మీద బ్యాండేడ్ తో ఎంతో మంది అమ్మాయిలు కనిపిస్తారు. న్యూజిలాండ్ లోని మహారి తెగలో పెదవులు, చుబుకాల పైన పచ్చ బొట్లు పొడిపించుకోవడం అందానికి చిహ్నం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో అభిప్రాయం.