గోళ్ళ అందం గురించి ఇప్పుడు ఖరీదైన జ్యూవెలరీలు , రంగులు డిజైన్లు వస్తున్నాయి. కానీ అసలు గోళ్ళ అందం గురించి ఆరోగ్యం గురించి సంరక్షణ విషయంలోనూ జాగ్రత్తను తీసుకుంటేనే చక్కగా చూసేందుకు బావుంటాయి. అలావుంటేనే వాటిని అలంకరించుకోగలం. వేడి నీళ్ళలో ఆలివ్ ఆయిల్ వెయిస్ గోళ్లను అందులోముంచి కొన్ని నిముషాలు ఉంచాలి. కాస్సేపయ్యాక మర్దనా చేస్తే గోళ్లు బావుంటాయి. రోజ్ వాటర్ తో తుడిస్తే కూడా గోళ్లకు తేమ అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ప్రతి రోజూ ఏ బేబీ ఆయిల్ తోనో మర్దనా చేసినా గోళ్లు పొడిబారకుండా ఉంటాయి. కీరా రోజ్ ముక్కలతో గోళ్ళని తుడిస్తే మెరుస్తుంటాయి. కొబ్బరినూనెలో వుండే ఆరోగ్యకరమైన కొవ్వులు పోషకాలు గోళ్లకు మేలు చేస్తాయి. పళ్ళుతోమే పేస్ట్ ను గోళ్ళపైన రాసి మృదువుగా రుద్ది కడిగితే వాటిపై పేరుకున్న మురికి పోతుంది. మొహం విషయం లోనే కాదు. చేతులు కళ్ళు గోళ్లు పదాలు పగుళ్లు విషయంలో కూడా శ్రద్ధగా ఉంటేనే అందంగా శుభ్రంగా ఉన్నట్టు.
Categories