Categories
2019 లో విడుదలైన 2017 నాటి క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మహిళలపై జరుగుతున్నా నేరాలు ,ఘోరాలసంఖ్యా నమోదు భయం వేసేంత పెరిగింది . మహిళల పైఅఘాయిత్యాలకు సంబంధించి సగటుకు రోజుకు 1000 క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి . ఏటా మహిళలపై జరుగుతున్నా నేరాల సంఖ్య 3.5 లక్షల పైమాటే లైంగిక వేధింపుల కేసులు రోజుకు 241 నామోదవుతున్నాయి . ప్రతిరోజూ 28 మంది మహిళలు వరకట్న బాధితులుగా కాలి బుడిద అవుతున్నారు . మహిళలపై హింస కేసుకు నమోదు కావు . ఒక వేళ నమోదైన చాల భాగం పెండింగ్ లోనే ఉంటాయి . 89.6 శాతం కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. మూడేళ్ళుగా 1.17లక్షల రేప్ కేసులు పెండింగ్ ఉండగా ,ఈ సంవత్సరం మరో 28,750 కేసులు విచారణకు వచ్చి చేరాయి . ఇదీ ఇవ్వాల్టి పరిస్థితి .