ఎన్ని పనులున్నా వేగంతో,ప్లాన్ ప్రకారం చేసుకుపోయే వ్యక్తులు కూడా వ్యాయామం దగ్గర కొస్తేనే అస్సలు కుదరటం లేదు అంటున్నారు. ఈ వ్యాయామం ప్రయోజనం మనవారి,మెదడుకి చేరకపోవడం వల్లనా సమస్యలు అంటారు నిపుణులు. ఒక పది నిముషాలు చాలు ఒక నిర్దిష్టమైన శరీర కదలికలు వుండే వ్యాయామం ఎంచుకుంటే,మెదడులోని ఎన్ని భాగాలు చైతన్యవంతం అవుతాయి న్యూరో టూన్స్ మీటర్లూ చురుకుగా పనిచేస్తాయి. మెదడు శ్వాసకోశాలు,గుండె ఒకే సమయంలో చైతన్య వంతం గలిగె శక్తి వ్యాయామానికి ఉంటుంది. దీని ఫలితంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏక కాలంలో ఎన్ని పనులు చేయగల సామర్థ్యం కచ్చితంగా పెరుగుతుంది. మెదడుకు అంచనా వేసే శక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

Leave a comment