ఈజిప్ట్ లోని కైరా నగరానికి దగ్గర గా ఉండే అల్ సమాహా  గ్రామంలో కేవలం ఒంటరి మహిళలు మాత్రమే ఉంటారు.మగవాళ్లకు ఇక్కడ ప్రవేశం లేదు. ఈ ఉరిని 1998 లో వితంతు మహిళల కోసం కేటాయించింది ప్రభుత్వం. సాగు చేసుకొనే భూమి ఇచ్చింది. నెమ్మదిగా విడాకులు తీసుకున్నవారు గృహహింస బాధితులు కూడా వచ్చి చేరారు వీరంతా వ్యవసాయం ,పశువుల పెంపకం చేతి వృత్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొంటారు. మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకొంది.

Leave a comment