అమెరికాలో చదివి వచ్చిన అమ్మాయయినా పెళ్ళంటే పూలజడ వేసుకోవాల్సిందే. పొడుగ్గా జడ అల్లి, బంగారు జడగంటలు పెట్టి మళ్ళి పూలతో జడ వేస్తె పెళ్లి ముస్తాబు పూర్తి అయినట్లు. గత తరంలో మల్లెపువ్వుల సీజన్ వచ్చిందంటే పెళ్ళీకుతురికే, పదేళ్ళ అమ్మాయికైన మల్లెపూల జడ కుట్టాల్సిందే. మంచి మంచి మొగ్గలు ఏరి, పొడవాటి చీపురు పుల్లకు ఇటో వరస అటో వరస గుచ్చి మధ్యలో పూలు పేరుస్తూ వేసే జడ ఎంతో బావుంటుంది. జడ అల్లుతూ ఒక్కో పువ్వు పేరుస్తూ వేసే జడ అల్లినా బావుండేది. అటు ఇటు చీపురు పుల్లకు గుచ్చిన మొగ్గలు మధ్యలో ఒక వరస కనకాంబరాలు, మధ్యలో మల్లెలు ఇంకో వరస దవనం, మరువం పెట్టిన జడ మెడ తిప్పలేనంత బరువుగా అందంగా వుండేది. అలాంటి పొడవాటి జుట్టులో, జడ అల్లే ఓపిక ఇప్పుడు వున్నాయో లేదో తెలియదు, కానీ ఇవ్వాళ పూల జడల బిజినెస్ సక్సస్ ఫుల్ గా నడుస్తోంది. ఏ సీజన్ లో ఏ పువ్వులోస్తే ఆ పువ్వులోస్తే ఆ పువ్వులతో పువ్వులజాడలు ఆన్ లైన్ లో కనువిందు చేస్తున్నాయి. పెళ్లి పూల జడలు సెట్ చేస్తే కావలసినన్ని డిజైన్ లు.
Categories