Categories
పని పైన ఏకాగ్రత కుదరక ఇబ్బందిగా ఉంటే ఆ నిమిషంలో కాసేపు కిటికీలోంచి కనబడే చెట్లనైనా చూస్తూ రిలాక్స్ అవమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రకృతి ఆధారిత వ్యాయామాలతో మూడు స్థిరంగా ఉంటుంది. ఎప్పుడూ నాలుగు గోడల మధ్యనే గడిపేవారు కొద్ది సేపైనా బయటివాతావరణంలోకి రావాలి. అప్పుడే ఆ పచ్చని ప్రకృతి కళ్ళకు శాంతినిచ్చి మనసు,శరీరాన్ని సమతుల్యంలో ఉంచుతుంది.పోనీ ఆఫీస్ ఇంటిదగ్గర పార్కులు చెట్లు లేవని నిరాశపడనక్కరలేదు,కుండీల్లో పచ్చని చెట్లు పెంచి ఏ మూల ఉంచుకొన్న కాసేపు ఆ జీవత్వం నిలువంతా నింపుకున్నా మొక్కల సౌందర్యం చూస్తూంటే మనసు తేరుకొంటుంది.తిరిగి పనిలోకి వెళ్ళగలిగే ప్రోత్సహాం ఉత్సహాం మనసులోంచి దొరుకుతుంది.