Categories
అందం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకునే మహిళలు పాదాల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. పగుళ్ళతో, మట్టి పేరుకుని ఎంత నీట్ గా తయారయినా దుస్తుల నడుమ నుంచి, సమస్య మరీ ఎక్కువగా వుంటుంది. ప్రతి రోజు క్రమం తప్పకుండా క్లీనింగ్, మాయిశ్చురైజింగ్ చేసుకుంటే పొడి బారిన పగిలిన పాదాలు మృదువుగా తయ్యారావ్వుతాయి. ముందుగా ఒక స్పూన్ వేజివైన్ నిమ్మకాయ రసం కలిపినా నీళ్ళతో పడుకునే ముందర పాదాలు నానేలా పెట్టుకోవాలి. పాదాలు కడుక్కొన్నాక ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ రాసి రాత్రంతా అలా వదిలేస్తే పాదాల పగుళ్ళు పదిహేను రోజుల్లో తగ్గిపోతాయి. విటమిన్లు, ఖనిజాలు, జింక్ లోపం వల్లే పాదాల్లో పగుళ్ళు వస్తాయి. రోజువారీ పనుల్లో ముఖ్య భూమిక వహించిన పాదాల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.