వన్ సురక్ష సమితి పేరుతో అటవీ సంపద కాపాడే ఉద్యమం మొదలు పెట్టింది. ఆమెది ఒరిస్సా జార్ఖండ్ లోని ముట్టూర్ గావ్ చెందిన మాన్ సింగ్ టుడు. ఆమె భర్త వంట చెరుకు కోసం చెట్లు నరికి వేయడం చూసింది జమునా. అటవీ సంరక్షణ ఒక ఉద్యమం లాగా మొదలు పెట్టింది. జమునా ప్రోత్సాహంతో వన్ సురక్ష సేవ సమితి బృందాలు మూడు వందలకు పైగా ఏర్పడ్డాయి వాటిలో పదివేల మంది సభ్యులున్నారు. పర్యావరణాన్ని రేపటి తరానికి కానుకగా ఇద్దామనుకొనే ఈమె ఆశయం గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీతో సత్కరించింది.