నిద్ర పట్టకపోవటం గురించి ఎవరైనా పదే పదే  చెపుతుంటే మరీ అంత సమస్య నా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చిరాకు పెట్టె ఇబ్బంది.  రాత్రివేళ కూడా మనకు ప్రశాంతంగా ఆలోచనలు లేకుండా ఉండలేక పోతున్నామని ఆందోళన భావోద్వేగ పూరితమైన ఆలోచనలు వదలటం లేదనీ నిద్రలేమితో బాధపడేవారు అనేకమంది చెపుతారు. నిద్ర పట్టటం లేదని మనసుకు అనిపిస్తే నిద్రపోలేక పోతున్నామనే  ఆలోచన ఆందోళనగా మారే పరిస్థితి ఇంకా పాడైపోతుంది. అయితే ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకుండా శ్రద్ధగా  పాటలు పాడటం ప్రాక్టీస్ చేయండి అంటున్నారు మానసిక శాస్త్ర వేత్తలు. ఇతర ఆలోచనలకూ ఆస్కారం ఇవ్వకుండా ఇతరత్రా మానసిక ఆనందాన్నిచ్చే అంశాలపై దృష్టి  మళ్లించి సీరియస్ గా ఏదైనా లయ బద్ధంగా పద్యాలూ ప్రాక్టీస్ లేదా పాటలు నేర్చుకోవటం చేయమంటున్నారు . మధ్య రాత్రిలో నిద్ర మెలకువ వచ్చినా ఇదే టెక్నీక్. ఏదైనా సరిగా రాగ యుక్తంగా పాడుతున్నామా లేదా చూస్తూ సాధన చేయాలి. ఒక నెలరోజుల పాటు ఆహ్లాదాన్ని కలిగించే ఈ పనిలో పడితే నిద్ర లేమి దూరమై పోతుంది. పూర్తీ ఏకాగ్రత కుదురుతుంది. మనకు తెలియకుండానే నిద్రకు మనసు సిద్దమవుతుంది అంటున్నారు.

Leave a comment