మేకప్ కోసం ఉపయోగించే కొన్ని వస్తువులు చాలా ఖరీదు గా ఉంటాయి. అవి చేయి జారి కింద పడిందో, మిగతా సామాన్ల మద్యని నొక్కుకునో ముక్కలైపోతేనో అవి ఎలా వాడుకోవాలో తెలియక చాలా కష్టంగా వుంటుంది. కానీ కాస్త శ్రద్ధగా వాటిని ఒక రూపంలోకి తెచ్చి వాడుకో వచ్చు. ఉదాహరణకు పెదవులకు వేసుకునే లిప్స్టిక్ పై దాకా ఓపెన్ చేస్తే ఒక్కోసారి విరిగిపోవచ్చు. దాన్ని తిరిగి ఉపయోగించుకోవాలంటే ఆ ముక్క అడుగున సన్నటి సెగపై వేడి చేసి ఆ కరిగిన దానిని విరిగిన దానికి అతికించి ఫ్రిజ్ లో పెడితే ఆ ముక్క అతుక్కు పోతుంది. దీన్ని ఎప్పటిలా వాడుకో వచ్చు. కాంపాక్ట్ పౌడర్ డబ్బా పగిలి పోయి విరిగి ముక్కలైనదనుకోండి ఆ పౌడర్ ముక్కలన్నింటినీ మెత్తగా పొడి చేసుకుని అందులో కొన్ని ఆల్కహాల్ చుక్కలు కలిపి డబ్బాలో నొక్కి పెట్టేస్తే చక్కగా ఎప్పటిలా డబ్బాకు అతుక్కుపోతుంది. మస్కారా ఎండిపోయి ఉపయోగ పడక పొతే అందులో కళ్ళకు వేసుకునే డ్రాప్స్ రెండు మూడు చుక్కలు కలిపేసి వాడుకోవచ్చు. అలాగే మస్కారా ని గట్టిగా మూత పెట్టి దాన్ని వేడి నీళ్ళల్లో ఓ నిమిషం పాటు ముంచి తీసిన మస్కారా వాడుకునేందుకు వీలుగా తయారవుతుంది.
Categories