సినిమాల్లో బోలెడన్ని జోకులు పేలాయి, అప్పుడు నవ్వొస్తుంది గానీ, నిజంగా చెవులు వినబడకపోవడం పెద్ద సమస్యే. సరిగా వినపదకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు గానీ పెయిన్ కిల్లర్స్ మాత్రం ఇందుకు కారణం కావచ్చంటారు డాక్టర్లు. తరచుగా బ్రూఫిన్ లేదా పారాసెటమాల్ మాత్రలు వాడుతుంటే వినికిడి శక్తి తగ్గుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా వారంలో రెండుసార్లు పెయిన్ కిల్లర్లు వాడే మహిళల్లో హియరింగ్ లాస్ 24శాతం ఉన్నట్లు గుర్తించారు. ఆస్ప్రిన్ కూడా ఇందుకు కారణమవుతుంది. లోపల చెవిలోని ‘కొచిలియా’ అని ఒక నత్త లాగా ఉండే చిన్న వినికిడి మెకానిజానికి రక్త సరఫరా తగ్గించడం ద్వారా పెయిన్ రిలీవార్లు డ్యామేజీ చేస్తాయని చెపుతున్నారు. పారాసెటమాల్ వంటివి కూడా ఈ అపకారం చేస్తాయంటున్నారు. అంచేత శరీరంలో ఎక్కడైనా నొప్పి అనిపించగానే గబుక్కున మాత్రలు మింగేసే ముందు కొంచెం ఆలోచించి సహజ మార్గాలతో ఉపశమనం పొందే ప్రయత్నం చేయాలి. మరీ భరించలేకపోయినట్లయితే తప్ప పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళనే వెళ్లొద్దు.
Categories
WhatsApp

పెయిన్ కిల్లర్ తో హియరింగ్ లాస్

Leave a comment