రూఫ్ గార్డెన్స్ ఎంతో ఇష్టం తో పెంచుతున్నారు. ఆకు కూరలు కూరగాయలు పెంచడంతో పాటు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు పెంచే చెట్లు, పక్షులను, సీతాకోక చిలుకలను తేనె తీగలను ఆకర్షిస్తే బాగుంటుంది. ఇల్లే ఒక నందన వనం అవ్వుతుంది అనుకుంటారు. ఎగిరే పక్షులు పిట్టలు వుంటే ఎంత బాగుంటుంది. బహునియాను పెంచుకోమ్మంటారు వృక్ష శాస్త్రజ్ఞులు. దీన్ని ఆఫికన్ ఫ్యుమ్, కామేల్స్ ఫుడ్, రెడ్ ఆర్కిడ్ బుష్ అంటారు. ఇది ఆఫ్రికా కు చెందిన మొక్క. ఐదారు అడుగుల ఎత్తు పెంచుతుంది. ఎండ నీడల్లోను చక్కగా ఎదుగుతుంది. ఇది సీతాకోక చిలుకలు, పక్షులను ఆకర్షిస్తుంది. అనేక రకాల పక్షులు దీనికి పూసే ఎర్రని పువ్వులను ఇష్టపడతాయి. దట్టంగా పెరుగుతుంది గనుక ఎన్నో చిన్న ఈ చెట్టు పైన గూళ్ళు కట్టుకుంటాయి. పువ్వులు చాలా చిన్నగా పగడపు ఎరుపుతో అందంగా ఉంటాయి.
Categories