Categories
విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది కనుక నిమ్మపండు నిస్సందేహంగా శరీరానికి చాలా మంచిది. కాని పళ్ళ ఎనామిల్ ను నిమ్మపండు ప్రభావితం చేస్తుంది. నిమ్మపండులో ఎసిడిక్ లక్షణాల వల్ల దీన్ని నేరుగా తీసుకుంటే పళ్ళకు హాని జరుగుతుంది. నిమ్మ చెక్కను పళ్ళ నడుమ పెట్టుకుని రసం పీల్చడం,చప్పరించి తినడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల నిమ్మరసం నేరుగా పళ్ళకి తగిలి ఎనామిల్ దెబ్బతింటుంది. పళ్ళ రసాలు, నీళ్ళలో నిమ్మరసం పిండి తాగడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు కాని ఇది ఎసిడిక్ ప్రభావం ఉన్న ఆరెంజ్ రసం వల్ల మాత్రం పళ్ళకు ఎలాంటి నష్టం ఉండదు.