చివరకు ఇది కూడా వచ్చేసింది. పళ్లు తోముకోవడం కూడా బద్దకం అనుకొనే వాళ్లకోసం పూర్తి స్థాయి ఆటోమేటిక్ బ్రష్. దీనిపేరు అమా బ్రష్ మోటర్ యూనిట్. పళ్లు అదే శుభ్రంగా తోమేస్తుంది. కుత్రిమ దంతం అమర్చుకొని బ్రష్ లాంటి మౌత్ పీస్ నోట్లో పెట్టేసుకుని గుండ్రని మోటర్ యూనిట్ ను అయస్కాంతంలాగా బ్రష్ బయట భాగంలో అతికించేస్తే దంతాలన్నీ పది సెకండ్లలో శుభ్ర పడిపోతాయి. బ్రష్ కిందా మీదా అమర్చిన సిలికాన్ కుచ్చులు మృదువుగా దంతాలను అన్ని వైపులా శుభ్రం చేస్తాయి. అన్నట్లు ఇవి స్కాండిలైంటిస్ తో, ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్లకి ఉదయాన్నే పళ్లు తోముకోవడం కష్టమైతే వాళ్లకు చక్కగా ఉపయోగ పడుతుందట.

Leave a comment