
అమెజాన్ అడవుల్లో మంటలు వెనక రాజకీయాలు అన్న అంశంపై చేసిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది.బ్రెజిల్ కు చెందిన పలోమ మానవ హక్కులు, పర్యావరణ ఉద్యమకారిణి. బ్రెజిల్ యువత మొదలు పెట్టిన క్లైమేట్ వర్క్ గ్రూప్ సమన్వయకర్త.ఈ 27 సంవత్సరాల స్టూడెంట్, మన జీవితాలు మన భూములు అమ్మకం కోసం కాదు. పర్యావరణ సమస్యలకు మార్కెట్ సొల్యూషన్స్ మార్గాలు కావు అంటుంది ఐక్యరాజ్యసమితి అడ్వైయిజ్ గ్రూప్ లో సలహాదారు పలోమ కోస్టా.